తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ పర్యటనను అడ్డుకోము.. మమ్మల్ని పోలీసులు అడ్డుకోవద్దు..' - సీఎం కేసీఆర్​ పర్యటన

Komatireddy venkatreddy comments: రేపు యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం కేసీఆర్​కు స్వాగతం చెబుతూనే.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. భువనగిరి పట్టణంను టూరిజం పాయింట్​గా మార్చాలని.. రోప్​వే నిర్మాణం చేయాలని సీఎం కేసీఆర్​ను కోరారు.

MP komatireddy venkat reddy comments on cm kcr tour in yadadri bhuvanagiri district
MP komatireddy venkat reddy comments on cm kcr tour in yadadri bhuvanagiri district

By

Published : Feb 11, 2022, 4:50 PM IST

Komatireddy venkatreddy comments: సీఎం కేసీఆర్ రాజ్యాంగం రద్దు చేస్తామనటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా.. తాను ఎంపీ అయినా అదంతా.. రాజ్యాంగం ద్వారానే అని గుర్తుచేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ తప్ప.. వేరే ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరగటంలేదని ఆరోపించారు. సీఎం పర్యటనను తాము అడ్డుకోమన్న వెంకట్​రెడ్డి.. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పిస్తామన్నారు. అందుకు పోలీసులు అడ్డుకోకూడదని కోరారు. భువనగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వెంటనే నిధులు మంజూరు చేయాలి..

"రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దళితుల ఆత్మ క్షోభిస్తుంది. పేదలు, దళితులు తిండి తింటున్నారంటే రాజ్యాంగ ఫలితమే. భువనగిరిలో అంబేడ్కర్ భవన్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దానికి ఎంపీ నిధులతో 50 లక్షల రూపాయలు నేను కేటాయించాను. బిల్డింగ్ పూర్తి చేయటానికి తక్షణమే సీఎం కేసీఆర్​ నిధులు మంజూరు చేయాలి. పంచాయతీలకు 25 లక్షలు, మున్సిపాలిటీలకు కోటి రూపాయలు ఇస్తా అని సీఎం ప్రకటించి చాలా కాలం గడిచినా.. ఇప్పటి వరకు ఆ నిధులు అందలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పేద, బీసీ, మైనార్టీలకు రెండు వేల ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైల్వే నిర్మాణం కోసం కేంద్ర మంత్రితో ఇప్పటికే మాట్లాడాను."- కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details