కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను యాదగిరి గుట్ట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి ఆదేశాలపై పట్టణంలోని ఆరో వార్డులో నిరుపేదల సమక్షంలో కోమటి రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సుమారు 30 మంది పేదలకు, వృద్ధులకు చీరలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
యాదగిరి గుట్టలో ఘనంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడకులు - యాదగిరి గుట్టలో ఎంపీ కోమటిరెడ్డి జన్మదినం
యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. యాదగిరి గుట్ట పట్టణంలోని ఆరో వార్డులో నిరుపేదలకు నిత్యావసర సరకులు, చీరలు పంపిణీ చేశారు.

yadagiri gutta
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కల్వకొలను సతీశ్, కొమ్మగాని శంకర్ గౌడ్, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బి.ఎల్ల స్వామి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు బూడిద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఉల్లంఘనులపై లాఠీలు ఝుళిపిస్తున్న పోలీసులు