తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం' - యాదగిరిగుట్టలో సంతకాల సేకరణ కార్యక్రమం

రైతులను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో చేపట్టిన రైతుల సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

'రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం'
'రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం'

By

Published : Oct 3, 2020, 11:20 AM IST

ఏఐసీసీ ఆదేశాల మేరకు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ... స్వయంగా సంతకం పెట్టి యాదగిరిగుట్టలో రెండు కోట్ల సంతకాల సేకరణ ఉద్యమాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఆలేరు ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వ్యవసాయ బిల్లులతో ప్రధాని మోదీ, కొత్త రెవెన్యూ చట్టం పేరుతో సీఎం కేసీఆర్... రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్.... ఎల్​ఆర్​ఎస్​ పేరుతో పేదల రక్తాన్ని తాగుతూ రైతులు, ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రభుత్వమే చేయాలన్నారు. ఎల్​ఆర్​ఎస్​పై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లామని... అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు.

ఇదీ చూడండి: పశువులపై పులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు..

ABOUT THE AUTHOR

...view details