ఆఫ్రికా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన భువనగిరికి చెందిన పడమటి అన్విత రెడ్డిని చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రోత్సాహకంగా రూ.10 వేలను అందజేశారు. కిలిమంజారో పర్వతాన్ని 5 రోజుల వ్యవధిలో తన బృందంతో అధిరోహించానని అన్విత రెడ్డి తెలిపారు.
కిలిమంజారోని అధిరోహించిన అన్వితకు ఘనంగా సన్మానం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అన్విత రెడ్డి.. ఈ ఏడాది 5 అంతర్జాతీయ పర్వతాలు ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. తన లక్ష్యం చేరేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల సహకారం అందించాలని కోరారు.
కిలిమంజారో క్వీన్ అన్వితకు ఘనంగా సన్మానం
ఈ ఏడాది ఐదు అంతర్జాతీయ సమిట్స్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఆమె వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల సహకారం అందించాలని కోరారు. చౌటుప్పల్ లయన్స్ క్లబ్ నిర్వాహకులు అందించిన ప్రోత్సాహం స్ఫూర్తినిచ్చిందని అన్విత రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:వాహనాలను అపహరించే దొంగల ముఠా అరెస్ట్