మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్ పార్టీ మూడు తరాల నాయకులకు ముఖ్య సలహాదారునిగా సేవలందించి, పార్టీని గడ్డుకాలం నుంచి గట్టెక్కించారని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'కాంగ్రెస్ పార్టీ మూడు తరాలను ముందుకు నడిపించిన మహనీయుడు' - motkuru Congress leaders pay tribute to former President Pranab Mukherjee
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని యాదాద్రి భువనగిరి మోత్కూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు అన్నారు. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మోత్కూరు కాంగ్రెస్ నేతల నివాళి
సాధారణ క్లర్క్ స్థాయి నుంచి దేశానికే ప్రథమ పౌరునిగా ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా హస్తం నేతలు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ , యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు అవి శెట్టి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మందుల సురేశ్, గుండు , శ్రీను, పద్మ, నరసింహ పాల్గొన్నారు.
- ఇవీ చూడండి:పులికి చెమటలు పట్టించిన ఏనుగు!