తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందు శ్మశానవాటిక.. ఆ తర్వాతే రైతు వేదిన భవనం - యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గ్రామస్థుల ఆందోళన

రైతువేదిక భవనాన్ని నిర్మించే ముందు స్మశానవాటిక స్థలం చూపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.

mothkuru villagers protest
ముందు శ్మశానవాటిక.. ఆ తర్వాతే రైతు వేదిన భవనం

By

Published : Jul 27, 2020, 8:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించిన తర్వాతే రైతు వేదిక భవన నిర్మాణం చేయాలంటూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ముందుగా గ్రామసభ నిర్వహించి గ్రామస్థులంతా నిర్ణయం తీసుకున్నారు. శ్మశానవాటికకు స్థలం కేటాయించాకే... రైతు వేదిక భవనం నిర్మించాలంటూ నిర్మాణ ప్రదేశంలో నిరసన చేపట్టారు.

ఈ నెల 9వ తేదీన 22 లక్షలతో వ్యయంతో రైతు వేదిక భవనం నిర్మాణం కోసం ఊరు శ్మశానవాటిక స్థలంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఆదివారం గ్రామస్థులంతా గ్రామసభ నిర్వహించి శ్మశానవాటిక నిర్మించిన తర్వాతే... రైతు వేదిక భవనం నిర్మించాలని తీర్మానం చేసుకున్నారు. అందులో భాగంగానే ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి, కృష్ణ , రచ్చ సంజీవ రెడ్డి, లక్ష్మారెడ్డి, కనకయ్యతో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్​ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details