తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్ల విస్తరణలో నిరాశ్రయులైన వారిని దృష్టిలో పెట్టుకోండి - యాదాద్రి జిల్లా వార్తలు

రోడ్ల విస్తరణకు సహకరిస్తామని, దుకాణాల తొలగింపుతో సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని మోత్కూరు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల ప్రజలు కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. గతంలో తొలగించి వాటికి అదనంగా ఇప్పుడు మరో యాబై అడుగుల మేర ఇళ్లు, దుకాణాలు తొలగిస్తే తాము నిరాశ్రయులమౌతామని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్ల విస్తరణలో నిరాశ్రయులైన వారిని దృష్టిలో పెట్టుకోండి
రోడ్ల విస్తరణలో నిరాశ్రయులైన వారిని దృష్టిలో పెట్టుకోండి

By

Published : Jul 16, 2020, 7:26 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు.. స్థానికులను అయోమయానికి గురిచేస్తోంది. విస్తరణ పనుల్లో భాగంగా ముందుగా అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లో దుకాణాలను, తాత్కాలిక నిర్మాణాలను స్థానికులు తొలగించారు. ఐతే తాజాగా రహదారికి ఇరువైపులు ఉన్న దుకాణాలను మరో 50 అడుగుల మేర తొలగించాలని అధికారులు ఆదేశించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

రహదారి నిర్మాణం కోసం అధికారుల మాటకు కట్టబడి తామంతా నిర్ధేశిత స్థలాలను ముందే ఖాళీ చేశామని, ఇప్పుడు మరో 50 అడుగులు మేర తొలగించాలంటే తమ ఇళ్లు, దుకాణాలు పూర్తిగా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు తామంతా సహకరిస్తామని.. కానీ రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన వారిని దృష్టిలో ఉంచుకుని ఆశ్రయం కల్పించాలని మున్సిపల్​ కమిషనర్​కు స్థానిక ప్రజలు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details