తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోత్కూరు మున్సిపాలిటీని హరిత కేంద్రంగా మారుస్తాం' - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి తెలిపారు. మోత్కూరు పట్టణంలో మొక్కలు నాటారు. పచ్చదనం ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.

haritha haram
haritha haram

By

Published : Jul 27, 2020, 6:30 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి మొక్కలు నాటారు. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని లో ట్రావలర్స్ భవనం వెనక, యాదవ కాలనీలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం బోర్ బావికి మోటార్ బిగించి నీటి కొరత తీర్చారు.

పచ్చదనం ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందుకే రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి, టీపీవో వీరస్వామి, మేనేజర్ శంకర్, కౌన్సిలర్స్ పురుగుల వెంకన్న, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి , కూరెళ్ల కుమారస్వామి, వనం స్వామి, గుర్రం కవిత, ఎర్రవెల్లి మల్లమ్మ, లంకల సుజాత, మున్సిపల్ ఉద్యోగి సోమయ్య పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details