తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుడి కుటుంబానికి షటిల్​ క్లబ్​ చేయూత - telangana news

కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు షటిల్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. తమ కుటుంబానికి అండగా నిలబడిన దాతలకు మృతుడి కుమారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

shuttle club help to corona death family
కరోనా మృతుడి కుటుంబానికి షటిల్​ క్లబ్​ చేయూత

By

Published : May 8, 2021, 4:21 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోత్కూరు షటిల్​ క్లబ్​ చేయూతనందించింది. స్థానికంగా నివసించే నల్లమాస లింగయ్య కొన్ని రోజుల క్రితం కొవిడ్​తో మరణించారు. లింగయ్య కుమారుడు అఖిల్​కు రూ. 9 వేలు, 50 కేజీల బియ్యాన్ని షటిల్​ క్లబ్​ సభ్యులు అందజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి లింగయ్య చేసిన కృషిని సభ్యులు గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి అండగా నిలబడిన దాతలకు అఖిల్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షటిల్ క్లబ్ సభ్యులు కొప్పుల కరుణాకర్ రెడ్డి, మర్రి అనిల్ కుమార్, బోళ్ల సంపత్, ఎడ్ల శ్రీను మత్య్చగిరి, బయ్యనిరాజు, గుండగోని రామచంద్రు తదితరులు పాల్గొన్నారు

ఇదీ చదవండి:వామన్‌రావు హత్య కేసుపై ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details