యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల సమస్యల వలయంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త పేరుకపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్తంగా తయారైంది. పట్టణంలో ప్రధానంగా డంపింగ్ యార్డు లేమి, దోమలు, కోతులు, వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్మశాన వాటికలో సరైన వసతులు లేవని పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు అధిగమించి పురపాలిక పీఠాన్ని చేజిక్కించుకోవడానికి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఛైర్ పర్సన్ స్థానం ఓసీ మహిళకే !!
మోత్కూరు పుర పరిధిలోని ఛైర్ పర్సన్ స్థానం మహిళా జనరల్ కావడం వల్ల పార్టీల ప్రచారం ఆసక్తిగా మారింది. వార్డుల రిజర్వేషన్లు వెలువడగానే కాంగ్రెస్ నుంచి గుర్రం కవితను ఛైర్ పర్సన్‌గా ప్రకటించగా తెరాసలో ఇంకా వెల్లడించలేదు. ఫలితాల అనంతరమే ప్రకటిస్తామని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ తెలిపినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు.
12 వార్డులకు 45మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉండగా... కాంగ్రెస్ 12, తెరాస 12, స్వతంత్రులు 10, భాజపా 8, తెదేపా 2, సీపీఐ 1 చొప్పున బరిలో ఉన్నారు.
సమస్యల సుడిగుండంలో మోత్కూర్ పురపాలిక ఇవీ చూడండి : బస్తీమే సవాల్: 'పురపోరు'లో పార్టీల అభ్యర్థులకు తిరుగు'పోట్లు'