యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం చిర్రగూడూరులో వారం రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు మృతి చెందారు. తల్లి అంత్యక్రియల కోసం ముంబయి నుంచి వచ్చిన కూతురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో ఆ మహిళకు కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి ఎడ్లబండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోగా... నెగిటివ్ అని తేలింది.
వారం వ్యవధిలో తల్లీకూతురు మృతి.. పీపీఈ కిట్లతో అంత్యక్రియలు - తెలంగాణ వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా చిర్రగూడూరులో తల్లీకూతురు వారం రోజుల వ్యవధిలో మృతి చెందారు. తల్లి అంత్యక్రియలకు వచ్చిన కూతురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన పర్రెపాటి గంగమ్మ (75) వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ముంబయిలో ఉంటున్న మృతురాలి కూతురు ఐలమ్మ అలియాస్ రాములమ్మ (52) తల్లి అంత్యక్రియలకు హాజరైంది. ఆ నాటి నుంచి గ్రామంలోనే ఉంది. మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈ ఆకస్మిక మరణంతో కరోనా సోకిందని కుటుంబ సభ్యులు భావించారు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా... అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. తల్లి మృతిచెందిన వారం రోజులకే కూతురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు