ఎండలు ముదురుతున్నాయ్... తాగునీటి కోసం వెంపర్లాట మొదలైంది. ఒక్క పూట నీరు లేకుండా ఉండటం మనుషులకే కష్టం.. అలాంటింది ఇక జంతువుల పరిస్థితి ఏంటి. అలాంటి సంఘటనే శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై జరిగింది. ఓ కుళాయి వద్ద కోతులు తమ దప్పికను తీర్చుకొనేందుకు నానా తంటాలు పడ్డాయి.
మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు - water problems of monkeys
ఎండలు మండుతున్నాయి.. గొంతు తడి ఆరుతోంది. దీంతో మనుషులకే కాదు జంతువులకు కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తాజాగా అదే కోవలో శుక్రవారం కోతికి దాహం వేసింది. చుట్టుపక్కల నీరు దొరకలేదు. చేసేది ఏమీ లేక అక్కడే ఉన్న ఓ కుళాయి ద్వారా నీరు తాగి దాహం తీర్చుకుంది. ఈ సంఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది.
మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు
గతంలో ఆ క్షేత్ర పరిధిలో పలు చోట్ల నీటి తొట్టెల ఏర్పాటుతో... కోతులు, ఇతర జంతువులు, పక్షులు తమ దాహం తీర్చు కునేవి. కానీ క్షేత్రాభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం అవేవీ లేకుండా పోయాయి. దీంతో జంతువులు, పక్షులు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి ఆ మూగజీవాల సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :'ఇంధన ధరల పెరుగుదలపై నిరసనగళం విప్పాలి'