యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం ఊర్ల కోతుల లొల్లి ఎక్కువైంది. ఊరోళ్లు మస్తు పరేషాన్ అయితున్నరట. కోతులు ఇప్పటికే ఓ పది మందిని కరిశినయట. ఓ దిక్కు కరోనా భయంతోని ఇండ్లల్ల ఉంటే... అవి ఇండ్లళ్లకు కూడా వచ్చి బెదిరిస్తున్నయి. బెదిరించుడు ఒక్కటేనా... ఎవరిని పడితే వారిని కరుస్తున్నాయట.
'ఉంటే కోతులన్నా ఉండాలే... లేకపోతే మేమన్నా ఉండాలే' - monkeys problems
ఊరు ఊరంతా డప్పు సప్పుళ్లతో... కట్టెలు, పటాకలు పట్టుకొని యుద్ధానికి పోతుండ్రు. ఎవరిమీదికో కాదు... ఊళ్ల ఉన్న కోతులను ఎల్లగొట్టనీకి. ఊళ్లో ఉంటే కోతులన్నా..లేదంటే మనుషులన్న ఉండాలే అన్నంత సీరియస్‌గా తీసున్నరట. మరి ఆ కోతులు ఎంత ఇాబ్బంది పెడుతున్నయో..!
చిన్న పోరగాళ్ల చేతుల్లలా ఏం వుంటే గది గుంజుకపోవుడు... ఇండ్ల మీద గునపెంకలు, రేకులు పీకేసుడు ఒక్కటేంది అంగడంగడి జేత్తున్నయట. ఇగ పండ్ల చెట్లు పెంచుకుంటే ఒక్క పండు దక్కనిత్తలేవట. ఆఖరికి కూరగాయలు కూడా దక్కుతవలేవట. బయటికెళ్లితే.. పాపం అడ్డంతిరిగి బయపెడుతున్నయట. ఒక్కటా.. రెండా... మందకు మంద వచ్చి ఊరంత ఇబ్బంది పెడుతున్నయట.
ఇట్లయితే ఏట్ల అనుకున్నరేమో...వాటితో ఏగలేక ఊళ్లో ఒక్క కోతి కూడ ఉండొద్దని ప్రజలందరూ శపథం చేశిర్రట. ఎన్ని రోజుల్తెనా సరే కోతులో... వాళ్లో తెల్సుకుంటమని కజ్జకు కూసున్నరటా. ఈ ఊరే కాదు చుట్టు పక్క ఊళ్లల్ల గూడా ఇదే పంచాయితి.