యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఒక మగ కోతి.. నాలుగు పిల్లి పిల్లలను మానవత్వంతో అక్కున చేర్చుకుంది. అయితే ఆ పిల్లిపిల్లల నుంచి కోతిని దూరం చేయాలని స్థానికులు ప్రయత్నించినా.. అక్కడి నుంచి కదల్లేదు. అసలు ఆ వానరానకి ఏమనిపించిందో కానీ.. కన్న బిడ్డల్లా వారిని చూసుకుంది.
పిల్లి పిల్లలను అక్కున చేర్చుకున్న వానరం - మానవత్వంతో పిల్లిపిల్లలను అక్కున చేర్చుకున్న వానరం
ఒక మగ కోతి.. నాలుగు పిల్లి పిల్లలను అక్కున చేర్చుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఉదయం వచ్చిన కోతి.. సాయంత్రం వరకు ఆ పిల్లలను కన్నబిడ్డల్లా వారిని చూసుకుంది.

మానవత్వంతో పిల్లిపిల్లలను అక్కున చేర్చుకున్న వానరం
ఉదయం వచ్చిన కోతి.. సాయంత్రం వరకు ఆ పిల్లలతోనే గడిపింది. స్థానికులు పిల్లి పిల్లలను దాను నుంచి కాపాడే ఎంతో ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రెండింటిని మాత్రమే కాపాడగా.. మిగిలిన వాటిని కోతి తీసుకెళ్లింది. దీన్ని చూసిన ఆ కాలనీవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.