తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్లివిరిసిన మానవత్వం... కోతికి అంత్యక్రియలు - MONKEY CRIMITION

మనుషులు చచ్చిపోతేనే పట్టించుకోని ఈ ప్రపంచం... కోతి చచ్చిపోతే పట్టించుకుంటుందా..? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​ మండలం పల్లెర్ల గ్రామస్థులు మాత్రం పెంచుకున్న ఓ వానరం చనిపోతే... గాలికి వదిలిపెట్టకుండా స్మనాశవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

MONKEY CRIMITION

By

Published : May 13, 2019, 5:58 PM IST

Updated : May 13, 2019, 7:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​ మండలం పల్లెర్ల గ్రామంలో మానవత్వం వెలుగుచూసిన ఘటన చోటుచేసుకుంది. మనషులు చనిపోతేనే పట్టించుకోని ఈ జనం... ఓ కోతి చనిపోతే దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు.

అసలేం జరిగిందంటే....

గ్రామస్థులు ఓ వానరాన్ని సొంతమనిషికన్నా ఆప్యాయంగా పెంచుకున్నారు. ఆడుతూ ఎప్పుడు గెంతులు వేసే ఆ వానరంకు ప్రమాదవశాత్తు కరెంట్​ తీగలు తగిలి చనిపోయింది. గ్రామస్థులు దానిని అలాగే వదిలేయకుండా...ఒక మనిషి చనిపోతే ఏ విధంగా అంత్యక్రియలు జరుపుతారో... అదే విధంగా వానరానికి చేపట్టారు. స్థానికుల సహకారంతో ఆ కోతికి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులుగా పుట్టి జంతువుల కబేళరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించిన ఆ ఊరి గ్రామస్థులను అభినందించాల్సిందే. వారి మానవతా దృక్పథానికి సలాం కొట్టాల్సిందే.

వెల్లువిరిసిన మానవత్వం... కోతికి అంత్యక్రియలు
Last Updated : May 13, 2019, 7:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details