పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ - moderators secretly selling ration groceries which had given to poor people by government
నిరుపేదలకు అందించాల్సిన రేషన్ సరుకులు, బియ్యం, కిరోసిన్‌ను డబ్బులకు కక్కుర్తి పడు డీలర్లు రాత్రివేళల్లో యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెలుగు చూసిన ఘటనే దీనికి ఉదాహరణ.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ రేషన్ డీలర్.. షాపు నుంచి 200 లీటర్ల కిరోసిన్‌ను అపరిచిత వ్యక్తికి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. డీలర్ స్థానికంగా ఉండకపోవడం వల్ల మధ్యవర్తి ద్వారా సరుకులు అందిస్తున్నారని, వారేమో తమకు సరిగా ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. నలుగురు డీలర్లకు సంబంధించి ఒకే మధ్యవర్తి ఉండటం, లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోకుండా మాన్యువల్‌గా రికార్డులో రాసి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం ఇలా అక్రమంగా చౌకధరల వస్తువులు తరలుతున్నా... అధికారులు ఎటుంటి చర్యలు తీసుకోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు రేషన్ సరుకులు అందకుండా అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి : ఖమ్మం ఘటన విషాదమా.. నిర్లక్ష్యమా..?
TAGGED:
yadadri