యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూరు మండలాల్లో మోస్తరు వర్షం పడింది. యాదగిరిగుట్ట పట్టణంలో కురిసిన వర్షానికి పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. గత రెండు మూడు రోజులకు కురుస్తున్న వర్షాలకు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా క్షణం తీరిక లేకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
యాదాద్రి జిల్లాలో మోస్తరు వర్షం.. అన్నదాత హర్షం - మోస్తరు వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూరు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం.. అన్నదాత హర్షం
వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు వరితో పాటు పత్తి సాగు చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు వేశారు. కాని విత్తనాలు మొలకెత్తకపోవడం వల్ల మళ్లీ విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే పత్తి సాగు చేసిన రైతులు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి: రెండు మూడు రోజుల పాటు.. తేలికపాటి వర్షాలు