తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ - latest news on mlc krishnareddy

తెరాస ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

MLC started the BC Community Hall works
బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

By

Published : Dec 1, 2019, 11:11 AM IST

ప్రజా సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్​ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

తెరాస ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత చదువులు చదివి.... జీవితంలో పైకి రావాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినా గ్రామాల అభివృద్ధికే ఖర్చు పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీ కమ్యూనిటీ హాల్​ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ఇవీ చూడండి: మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details