యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులను తెరాస ప్రభుత్వం హీనంగా చూస్తోందని విమర్శించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. సర్పంచులు గెలిచినప్పటికీ ఇంకా చెక్‌పవర్ ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారుపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని ఎద్దేవా చేశారు.
5 నెలలైనా సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వరా..? - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
యాదాద్రిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్థానిక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. తెరాస ప్రభుత్వం ఇప్పటికీ సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్