తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి - యాదాద్రి వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డిలు కలిసి రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

MLC Palala Rajeshwar Reddy Starts Raithu Vedika Construction work
రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

By

Published : Jul 24, 2020, 4:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డిలు రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెరాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్​ కట్​ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రైతు వేదికల నిర్మాణం తెలంగాణ రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతాయని, పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details