తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగుల సమస్యలపై పోరాడతా: హరి శంకర్​గౌడ్​ - mlc elections campaign in mothkur

ఉమ్మడి నల్గొండ, వరంగల్​, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సుదగాని హరి శంకర్​గౌడ్ కోరారు. తాను గెలిస్తే.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని తెలిపారు. ఏ పార్టీతో సంబంధం లేని తనను గెలిపించాలని అభ్యర్థించారు.

mlc independent candidate campaigned for the elections
నిరుద్యోగుల సమస్యలపై పోరాడతా: హరి శంకర్​గౌడ్​

By

Published : Oct 6, 2020, 11:33 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సుదగాని హరి శంకర్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సంతోష్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నిరుద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ప్రచారానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

గతంలో గెలిచిన ఎమ్మెల్సీ నాయకులు తమ స్వార్థం కోసం పనిచేశారని.. నిరుద్యోగుల సమస్యలపై ఏనాడు శాసన మండలిలో ప్రశ్నించలేదని హరిశంకర్​గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని తనను గెలిపిస్తే.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం (టి.జి.ఎఫ్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోతుగంటి శంకర్, మాజీ సర్పంచ్ సుధగని పాండు, నాయకులు మద్దెల హరీష్ గౌడ్, పల్లపు స్వామి, దశరథ్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, తదిరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రత్యేక రైళ్లకు పార్శిల్​ వ్యాన్ల ఏర్పాటు: ద.మ.రైల్వే

ABOUT THE AUTHOR

...view details