తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక... పూర్తైన ఏర్పాట్లు - choutuppal

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. పోలింగ్​ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేశారు.

రేపే పెద్దలసభ పోలింగ్​

By

Published : Mar 21, 2019, 5:47 PM IST

రేపే పెద్దలసభ పోలింగ్​
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అయిదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందజేశారు. ఓటుహక్కు వినియోగించుకోవడానికి స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపుకార్డు తీసుకురావాలని ఓటర్లకు జిల్లా పాలనాధికారి తెలిపారు.చౌటుప్పల్​లో 465 ఓట్లు
చౌటుప్పల్ డివిజన్ పరిధిలో మొత్తం 465 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 26 న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లు లెక్కించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details