యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అనాజీపురంలోని మహాలక్షి జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ బుధవారం ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - LATEST NEWS ON MLA KISHOR
యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. పత్తిని విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలిపారు. కొనుగోలు కేంద్రం గురించి ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్
TAGGED:
LATEST NEWS ON MLA KISHOR