యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలోని గిరిజన తండాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమి పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై గిరిజనులు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి గిరిజన ప్రాంతాన్ని పరిశీలించి, వారితో మాట్లాడారు. ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. పట్టాలు లేకపోవడం వల్ల రైతుబంధు, రైతు బీమా కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గిరిజనులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
గిరిజన తండాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన - యాదాద్రి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ ప్రాంతంలోని గిరిజన తండాల్లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు.
'యాదాద్రి జిల్లాలోని గిరిజన తండాలలో ఎమ్మెల్యే పర్యటన'