యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, భూదాన్ పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం పోచంపల్లి మండలంలోని శివారెడ్డి గూడెం, గౌసుకొండ, వంకమామిడి, సల్లోనిగూడెంలోని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా... అనంతరం వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం, ప్రొద్దుటూరు, మాందాపురం, నాతాళ్లగూడెం, అక్కంపల్లి, దాసిరెడ్డి గూడెం, వలిగొండ మార్కెట్, అరూర్, సంగెం గ్రామాల్లో ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి - ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఎసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భువనగిరి మండలంలోని భువనగిరి, అనాజీపురం, నందనం, నాగిరెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన... పల్లె ప్రకృతి వనంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఎసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తామని... రైతులు ఆందోళన చెందొద్దన్నారు.
ఇదీ చదవండి:'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్