తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుని దర్శించుకున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ - yadadri district latest news

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

mla mallaiah yadav visited yadadri temple
యాదాద్రీశుని దర్శించుకున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​

By

Published : Oct 22, 2020, 3:39 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా​ దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే స్వామి వారి తిరు కల్యాణం పూజల్లో పాల్గొన్నారు.

తీర్ధ ప్రసాదాల అందజేత

అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనురాధ-బీరయ్య, మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య, స్థానిక తెరాస నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదీ చూడండి.. వరద బాధితులకు కారెం రవీందర్​ రెడ్డి ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details