MLA Rajagopal Reddy on Party change: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోరాడే పార్టీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భాజపాలో చేరుతున్నట్లు సామాజికమాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏది చేసినా ప్రజలకు చెప్పే చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
సొంత పార్టీలోనే తనకు ఆదరణ కరవైందన్న రాజగోపాల్ రెడ్డి.. ఇవాళ జరిగిన సీఎల్పీ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. కేసీఆర్‌పై బలంగా పోరాడితే కాంగ్రెస్‌లోనే ఉంటానని.. లేకుంటే ఏ పార్టీ గట్టిగా పోరాడితే అందులోనే చేరుతానని స్పష్టం చేశారు. ఏది చేసినా ప్రజల కోసమే చేస్తానని స్వార్థం కోసం పార్టీ మారనని తేల్చిచెప్పారు.