యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండురులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సందర్శించారు. ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. జిల్లా మంత్రి నేతృత్వంలో రెండు రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వసతులుపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.
మోటకొండురులో ఐసోలేషన్ సెంటర్: సునీత - తెలంగాణ వార్తలు
వ్యాక్సిన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, మందులను ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందేలా చూస్తామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండురులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో మోటకొండూరు పీహెచ్సీ ఆవరణలో కొవిడ్ రోగుల కోసం 20 నుంచి30 బెడ్లతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వ్యాక్సిన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, మందులను ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందేలా చూస్తామని తెలిపారు. అనంతరం ఆలేరు మండలంలోని పీహెచ్సీ, డయాలసిస్ సెంటర్లను పరిశీలించారు.
ఇదీ చదవండి:కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి పెంపు!