తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం కుటుంబాలకు రంజాన్​ తోఫా అందించిన ఎమ్మెల్యే - corona virus

యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో గల నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి రంజాన్​ తోఫా అందజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇంటి వద్దే రంజాన్​ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

mla gongidi sunitha mahendarreddy distributed ramzan topha in yadadri bhuvanagiri district
ముస్లిం కుటుంబాలకు రంజాన్​ తోఫా అందించిన ఎమ్మెల్యే

By

Published : May 17, 2020, 5:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి రంజాన్ తోఫా అందించారు. మల్లాపురం, సైదాపురం, జంగంపల్లి,దాతర్​పల్లి గ్రామాల్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకను అందచేశారు.

అనoతరం గ్రామాల్లో పారిశుద్ధ్యం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని శాలువాతో సన్మానించి, వారికి శానిటైజర్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు తమ ఇళ్ల వద్దే చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'కేంద్ర ప్యాకేజీ కూలీలకు పంచితే రోజుకూ రూ. 6-7'


ABOUT THE AUTHOR

...view details