తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేశారు. 66 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

mla gongidi sunitha distribution kanlyana laxmi, shadi mubarak cheques in yadadri bhuvanagiri district
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందంచిన ఎమ్మెల్యే

By

Published : Oct 29, 2020, 10:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, బొమ్మలరామరం మండలాల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. 66 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి ఎంపీపీ భూక్య సుశీల, బొమ్మలరామారం ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, ఆయా గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మాదాపురం, మల్కాపురం, ముల్కలపల్లి, వీరారెడ్డిపల్లి, కోమటికుంట, వెంకటాపురం, పల్లెపహాడ్, రుస్తాపురం, వాసాలమర్రి, తిరుమలాపురం, నాగినేనిపల్లి, దత్తాయిపల్లిలో పెళ్లి చేసుకున్న మహిళల తల్లులకు ఒక లక్ష నూట పదహరు రూపాయల చెక్కులు అందించామని సునీత తెలిపారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన కేసీఆర్​కు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండి:దుబ్బాక పోలింగ్​ అబ్జర్వర్​ను కలిసిన భాజపా నేతలు

ABOUT THE AUTHOR

...view details