యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బహుపేటకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ ఉంది. రైల్వేలైన్ దాటడానికి గ్రామస్థులు పడుతున్న అవస్థ చూసిన ప్రభుత్వం అండర్ బ్రిడ్జి మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. పనుల ఆలస్యంపై సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం - mla gongidi sunitha Angry on contractor in yadadri bhungiri
బహుపేట రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై అలేరు ఎమ్మెల్యే సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే సునీత