ప్రభుత్వ విప్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత, ఆమె భర్త టెస్కాబ్ వైస్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొవిడ్ బారిన పడిన ఈ దంపతులు... వారం పాటు చికిత్స పొందారు.
కరోనా నుంచి కోలుకున్న గొంగిడి సునీత దంపతులు - MLA Gongidi Sunita latest news
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. కొవిడ్ బారిన పడిన ఈ దంపతులు వారం పాటు చికిత్స పొందారు.

కరోనా నుంచి కోలుకున్న గొంగిడి సునీత దంపతులు
సికింద్రాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల... అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 1న సాయంత్రం ఎమ్మెల్యేకు... 3న ఉదయం ఆమె భర్తకు పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరితోపాటు ఆమె అంగరక్షకుడు, వ్యక్తిగత సహాయకుడికి కూడా... వైరస్ సోకింది. కొవిడ్ సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్న సునీత... తమ క్షేమాన్ని కాంక్షించిన అందరికీ రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా
Last Updated : Jul 10, 2020, 8:22 PM IST