వ్యవసాయరంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పర్యటించిన ఆయన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మోత్కూరు మండలంలోని అనాజిపురం, పాటిమట్ల గ్రామాల్లోరూ. 22లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. అనంతరం అడ్డగుడూరు మండలం గట్టుసింగారం, చౌళ్లరామారంలో రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌బాబు - ఎమ్మెల్యే గాదరి కిశోర్‌బాబు వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పర్యటించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
రూ.10.5లక్షల వ్యయంతో చౌళ్లరామారంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం చిర్రగూడూరులో సీసీరోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మోత్కూరు మున్సిపల్ ఛైర్పర్సన్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు శారద, స్థానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:indrakaran reddy: 'ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'