తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ - అనాజిపురంలో ఎమ్మెల్యే పర్యటన

మోత్కూరు మండలం అనాజిపురంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ పర్యటించారు. గ్రామంలో 33/11 కేవీ విద్యుత్​ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు.

MLA Gadhari Kishore Kumar opened the power station
విద్యుత్​ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి

By

Published : May 14, 2020, 1:46 PM IST

యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో నూతనంగా నిర్మించిన విద్యుత్​ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. నియోజక వర్గ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు. సబ్​స్టేషన్​ నిర్మాణానికి స్థలం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రైతులకు ఉచిత కరెంటు ఇవ్వనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న భాజపా ఎంపీలు... రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఇదీ చదవండి:'12 మంది వైరస్ బాధితులు... వలస కూలీలే'

ABOUT THE AUTHOR

...view details