విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. కరోనా వల్ల పాఠశాల విద్యార్థులకు తీరని లోటు జరుగుతోందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని కంచనపల్లిలో రూ.2.70కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
కేజీ టూ పీజీ విద్యంలో భాగంగా కస్తూర్బాగాంధీ, గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందిస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. కరోనాపై పోరుకు యుద్ధంలో సైనికునిలాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసించేలా కృషి చేయాలని కోరారు.