అవయవ దానం చేసి నర్సిరెడ్డి అభినవ కర్ణుడయ్యాడని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరికిశోర్ కుమార్ అన్నారు. నర్సిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి.. తక్షణ సాయంగా రూ.50,000 నగదును అందజేశారు. డబుల్ బెడ్రూం ఇల్లుతో పాటు పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీకి చెందిన వరకాంతం నర్సిరెడ్డి అనే పేద రైతు ఈనెల 30న బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారు.
"నర్సిరెడ్డి చనిపోవడం బాధాకరం. ఆపదలో ఉన్న ఇతరుల జీవితాలను నిలబెట్టడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. గుండెతో పాటు ఇతర అవయవాలను దానం చేయడం గొప్ప విషయం. తాను మరణిస్తూ ఐదుగురు జీవితాలలో వెలుగులు నింపారు. వారి కుటుంబానికి నా సహాయసహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి."