తెరాస మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో 35, అడ్డగూడూరు మండలంలో 31 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. గతంలో ఆడపిల్ల పుట్టిందని కన్నీరు పెట్టుకునేవారు కానీ నేడు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడుతున్నారని పేర్కొన్నారు.
'తెరాస మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం' - తెలంగాణ వార్తలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే గాదరి కిశోర్, కల్యాణ లక్ష్మీ చెక్కులు
గర్భిణీలకు అన్ని రకాల వసతులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవమైతే కేసీఆర్ కిట్టు, నగదు అందిస్తోందని గుర్తు చేశారు. ఆడపిల్లలు చదువుకోవడానికి గురుకులాలు, పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని వివరించారు.
ఇదీ చదవండి:Vaccine: పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే.. బిడ్డకూ రక్ష