తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప.. ప్రజలు బాగుపడలేదు' - ఈటల రాజేందర్ తాజా వార్తలు

Etela Comments on KCR: రాష్ట్రమొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రజలు ఆశించారని.. రాష్ట్రం వచ్చాక ప్రజల ఆశలు అడియాశలయ్యాయని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.జెండాలు, పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాడినట్లు ఆయన గుర్తు చేశారు.

ఈటల రాజేందర్‌
ఈటల రాజేందర్‌

By

Published : May 25, 2022, 5:33 AM IST

Updated : May 25, 2022, 8:32 AM IST

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప.. ప్రజలు బాగుపడలేదు

Etela Comments on KCR: రాష్ట్రమొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ప్రజలు ఆశించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక ప్రజల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఏర్పాటు చేసిన పలు పార్టీల నేతలు భాజపాలో చేరిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప.. ప్రజలు బాగుపడలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. అభివృద్ధి జరగలేదని చెప్పేందుకు తుర్కపల్లి మండలమే నిదర్శనమన్నారు. వరి పంట వేయొద్దని హుకుం జారీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని ఆరోపించారు. తరుగు పేరుతో రైతులను ఆగం చేస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేది తెలంగాణలోనేనని వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలోని రైతులను గాలికి వదిలేసి పంజాబ్‌ రైతులకు సాయం చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల చావులు సీఎం కేసీఆర్‌కు పట్టవా?అని ప్రశ్నించారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

"కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదు. ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు. రైతుబంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మీ డబ్బులు ఆయన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు. నిన్న మొన్న మద్యం ధరలను పెంచారు. పేదల సొమ్మును మద్యం పేరుతో కేసీఆర్ దోచుకుంటున్నారు." - ఈటల రాజేందర్‌ భాజపా ఎమ్మెల్యే

ఇదీ చదవండి:'రాష్ట్రంలో జోరుగా ధాన్యం కొనుగోళ్లు.. జూన్​ 10 వరకు పూర్తయ్యే అవకాశం'

ఒడిశాలో 'టమాట ఫ్లూ' కలకలం.. 26 మందికి పాజిటివ్​

Last Updated : May 25, 2022, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details