యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభు దర్శనాలు పునఃప్రారంభమయ్యేలోపే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆర్టీసీ కొత్త బస్టాండ్‌ను నిర్మిస్తామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించిన మంత్రులు... సైదాపురంలో ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం... గండి చెరువు వద్ద ఆర్టీసీ బస్టాండ్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వీవీఐపీల కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణాలను పర్యవేక్షించిన పలు సూచనలు చేశారు.
'ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాదాద్రి ఆర్టీసీ కొత్త బస్టాండ్' - యాదగిరిగుట్టలో వార్తలు
యాదాద్రిలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. సైదాపురంలో ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోకల్ బస్సులను సైతం నడుపుతామని మంత్రులు వివరించారు.
'ఆధ్యాత్మికత ఉట్టిపడేలా యాదాద్రి ఆర్టీసీ కొత్త బస్టాండ్'
యాదాద్రి అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రులు... స్వామివారిని దర్శించుకొకుండానే వెళ్లిపోయారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోకల్ బస్సులను సైతం నడుపుతామని మంత్రులు వివరించారు. మంత్రులతో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి. మున్సిపల్ ఛైర్మన్ సుధా తదితరులు పాల్గొన్నారు.