భువనగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. రహదారులు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద కూరగాయల విక్రయ దుకాణాలతో పాటు... నిరాశ్రయుల వసతి కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
భువనగిరిలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం - మంత్రి కేటీఆర్ వార్తలు
భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. భువనగిరి పట్టణంలో సమీకృత మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సీసీ రహదారులు, స్మృతి వనం నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
ktr
జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సీసీ రహదారులు, స్మృతి వనం నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ భాజపా శ్రేణులు... ప్లకార్డులతో నిరసనకు దిగాయి. సీపీఎం ఆందోళనకు దిగగా... రెండు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి :గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం