పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నరకు భువనగిరి చేరుకొని.. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.
నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
సమీకృత మార్కెట్, నిరాశ్రయుల వసతిగృహం, 4వార్డుల్లో రహదారులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పురపాలిక కౌన్సిలర్లతో సమావేశమై.. అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. కేటీఆర్ పర్యటన దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్‌ఐఎన్