అనారోగ్యంతో జార్జియాలో చిక్కుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన శివాణి వద్దకు తన కుటుంబ సభ్యులని పంపటానికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. జార్జియాలో తమ కూతురి పరిస్థితిపై, పూర్తి వివరాలతో ఈనాడు పేపర్ కథనాన్ని జోడించి కేటీఆర్‌కి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మీ కూతురి వద్దకు మిమ్మల్ని పంపిస్తాం: కేటీఆర్ ట్వీట్ - ఎన్నారైలు
అనారోగ్యంతో బాధపడుతూ కరోనా కారణంగా జార్జియాలో చిక్కుకున్న శివాణి పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సోమవారం ఆమె తల్లిదండ్రులను జార్జియా పంపడానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రి ట్వీట్ చేశారు.
మీ కూతురి వద్దకు మిమ్మల్ని పంపిస్తాం: కేటీఆర్ ట్వీట్
దానిపై స్పందించిన మంత్రి త్వరలోనే తమ ఎన్నారై డిపార్ట్మెంట్ మిమ్మల్ని సంప్రదిస్తారని శివాణి కుటుంబ సభ్యులకు రిప్లై ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నారై డిపార్ట్మెంట్ శివాణి కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారిని సోమవారం జార్జియా పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'