గురువారం ఉదయం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమారు మూడు వేల మందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఎంపీలు, ఎంఎల్సీలతో సహా గ్రామాల వారీగా ఓటరు నమోదు ఇంఛార్జిలతో మాట్లాడారు.
మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణ.. ఇంఛార్జితో మాటముచ్చట
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి అయిన శ్రావణితో మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు. మంత్రి తెరాస కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణలో భాగంగా పలువురికి ఫోన్ చేశారు.
అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి అయిన శ్రావణితో మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఓటరు నమోదు సహా పలు అంశాలపై కేటీఆర్ శ్రావణితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఫోన్ చేయడం సంతోషంగా ఉందని శ్రావణి తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం, మహిళలకు అన్ని అంశాల్లో గత ప్రభుత్వాల్లో చేయని పనులను చేస్తుందని.. నేను కూడా నా వంతుగా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పట్టభద్రులకు అవగాహన కల్పించి ఓట్లు వేయిస్తానని శ్రావణి తెలిపింది. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి స్వతహాగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సహాయం చేయడానికి నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి :భూ క్రమబద్ధీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదు : కేసీఆర్