యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మహిళా సైనిక డిగ్రీ కళాశాలలో ఆర్మీకోర్సులకు సంబంధించిన ఆర్మీ శిక్షణా పరికరాలను, వ్యాయామశాలను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ప్రారంభించారు. విద్యార్థులు చేసిన కవాతు, సైనిక విన్యాసాలు కేంద్ర సైనిక బలగాలు చేసినట్లుగా అనిపించిందన్నారు. ఇక్కడ విద్యనభ్యసించివారంతా కేంద్ర బలగాల్లో ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ఇతర అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్మీ శిక్షణా పరికరాలు, వ్యాయామశాల ప్రారంభించిన కొప్పుల - ఆర్మీ శిక్షణా పరికరాలు, వ్యాయామశాల ప్రారంభించిన మంత్రి కొప్పుల
మహిళా సైనిక డిగ్రీ కళాశాలలో ఆర్మీకోర్సులకు సంబంధించిన ఆర్మీ శిక్షణా పరికరాలను, వ్యాయామశాలను మైనారిటీ సంక్షే శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
![ఆర్మీ శిక్షణా పరికరాలు, వ్యాయామశాల ప్రారంభించిన కొప్పుల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4984224-thumbnail-3x2-koppula.jpg)
ఆర్మీ శిక్షణా పరికరాలు, వ్యాయామశాల ప్రారంభించిన కొప్పుల