విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల బియ్యం కొనడం ఇబ్బందిగా మారిందని నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యాన్ని మంజూరు చేయించారు.
అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి - lock down in yadadri bhuvanagiri district
రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మంత్రి జగదీశ్ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేయించారు.
![అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి minister jagdeesh reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6548144-thumbnail-3x2-minister.jpg)
అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఆశ్రమం పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పోచంపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆగి ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.
అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఇదీ చూడండి:సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?