మైలసముద్రంలో చేపపిల్లలను వదిలిన మంత్రి
విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి నల్గొండ జిల్లా మైలసముద్రం చెరువులోకి చేపపిల్లలను విడిచిపెట్టారు.
నల్గొండ జిల్లా మైలసముద్రం చెరువులోకి విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి చేపపిల్లలను విడిచిపెట్టారు. అనంతరం మండలంలోని యడవెల్లి గ్రామంలో పశువులకు ఉచిత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ప్రోత్సహిస్తుందని వంద శాతం చేపలను సబ్సిడీగా అందిస్తోందని మంత్రి అన్నారు. పాడి పశువుల సంపదను పెంచేందుకూ సర్కారు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండ నరేందర్, ప్రజాప్రతినిధులు తెలిపారు.