యాదాద్రి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం 15వ ప్యాకేజీ పనుల పురోగతిని మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు, ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16 ప్యాకేజీ పనులను, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ, ప్యాకేజీ 15 పనుల పురోగతిని మంత్రి గమనించారు.
kaleshwaram: ప్యాకేజీ పనులను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే - భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కాళేశ్వరం 15, 16వ ప్యాకేజీ నిర్మాణం పనులను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు. కాలువ టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
kaleshwaram: ప్యాకేజీ పనులను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే
ప్యాకేజీ 15వై జంక్షన్ 1.075 కిమీ నుంచి 36.2 45 కిమీ వరకు కాలువ టన్నెల్ పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్తోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Bandi sanjay: 'సీఎం సకాలంలో స్పందించి ఉంటే జూడాల సమ్మె ఉండేది కాదు'