రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ప్రభుత్వం ఈ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకువచ్చిందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులను ఐక్యం చేయటం, వారికి గిట్టుబాటు ధర కల్పించడమే.. నియంత్రిత సాగు లక్ష్యమని ఆయన వెల్లడించారు.
'రైతులను ఏకం చేసేందుకే నియంత్రిత సాగు' - నియంత్రిత సాగు విధానంపై అవగాహన కార్యక్రమానికి మంత్రి జగదీస్ ఎంపీ లింగయ్య హాజరు
రైతులను ఐక్యం చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించడమే నియంత్రిత సాగు విధాన లక్ష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై భువనగిరిజిల్లాలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Breaking News
ఒక పంటకు ధర వస్తే , రైతులంతా అదే సాగు చేస్తున్నారని.. అవసరానికి మించి పంట మార్కెట్‌కి రావటం వల్ల ధర పలకడం లేదని మంత్రి తెలిపారు. మన ప్రాంత ఆహార అవసరాలు గుర్తించి, దానికి అనుగుణంగా రైతులు పంటలు పండించాలని, అందుకే రైతులు ఏ పంట పండిస్తున్నారనే విషయం విధిగా అధికారులకు తెలిజేయాలన్నారు.