Harish Rao in Yadadri: రానున్న రోజుల్లో యాదాద్రి నరసింహుడి పుణ్యక్షేత్రం ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యటక కేంద్రంగా మారబోతుందని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని హరీశ్‌రావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
హరీశ్‌రావు, గొంగిడి సునీత దంపతులకు అర్చకుల ఆశీర్వచనం కిలో బంగారం విరాళం
హరీశ్‌రావు దంపతులకు అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీశ్‌రావు దంపతులు.. స్వామివారి విమాన గోపుర స్వర్ణతాపడానికి సిద్దిపేట నియోజకవర్గం తరఫున ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
స్వామివారికి విరాళంగా కిలోబంగారం విరాళంగా ఇచ్చిన కిలో బంగారం హరీశ్‌రావుతో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులు, పలువురు తెరాస నేతలు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నేతలకు అర్చకులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు.
హరీశ్‌రావు, గొంగిడి సునీత దంపతులకు అర్చకుల ఆశీర్వచనం నిర్మాణాల పరిశీలన..
అనంతరం ఆలయ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ.. నిర్మాణాన్ని పరిశీలించారు. స్వర్ణతాపడం కోసం దాతల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. కచ్చితంగా విమాన గోపురానికి అవసరమయ్యే బంగారాన్ని దాతలు విరాళంగా ఇస్తారన్న విశ్వాసం ఉందని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రిని గొప్ప క్షేత్రంగా రూపొందించిన సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తూ.. తెరాస నేతలతో హరీశ్‌రావు దంపతులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
అనంతరం.. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. భాజపా చేస్తున్న తప్పుడు వాట్సప్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగానికి సూచించారు. ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని... ఈ విషయాన్ని భాజపా నేతలు ఒప్పుకోకుండా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.
"ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉంది. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకునే యూపీ అట్టడుగున ఉంది. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే.. 7 లక్షలే ఖాళీలున్నాయని అబద్దాలు చెబుతున్నారు. రాజ్యాంగం గురించి సీఎం కేసీఅర్ ఏం తప్పు మాట్లాడారు..? దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి పోతుంది.. న్యాయం చేయాలంటున్నాం. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచాలి అంటే పట్టించుకోరు. తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టాలి."- హరీశ్‌రావు, మంత్రి.
ఇదీ చూడండి: