తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి సేవలో మంత్రి ఎర్రబెల్లి - యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

యాదాద్రీశుడిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థించారు. సాగర్ ఎన్నిక ఫలితాలు సీఎం కేసీఆర్ ప్రజామోద పాలనకు నిదర్శనమని కొనియాడారు.

minister errabelli dayakarrao,yadadri temple, yadadri bhuvanagiri
minister errabelli dayakarrao,yadadri temple, yadadri bhuvanagiri

By

Published : May 3, 2021, 4:42 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేశారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని నారసింహుడిని కోరుకున్నామన్నారు. పలు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివని విమర్శించారు.

సాగర్ ఎన్నిక ఫలితాలు సీఎం కేసీఆర్ ప్రజామోద పాలనకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం

ABOUT THE AUTHOR

...view details